Skip to content
-
Subscribe to our newsletter & never miss our best posts. Subscribe Now!
Mana Praja Akshram

News

Mana Praja Akshram

News

  • Home
  • Home
Close

Search

  • https://www.facebook.com/
  • https://twitter.com/
  • https://t.me/
  • https://www.instagram.com/
  • https://youtube.com/
Subscribe
News

మహిళా సంఘం భవనానికి భూమి పూజ

By admin
March 3, 2026 1 Min Read
0
  •  

మహిళా సంఘ భవనానికి భూమిపూజ…

సర్పంచ్ కల్పన రాజిరెడ్డి….

జనగామ/ బచ్చన్నపేట, మార్చి 2 (ప్రజా అక్షరం ప్రతినిధి) :

జనగామ జిల్లా బచ్చన్నపేట
మండలంలోని లక్ష్మాపురం గ్రామం… అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని. స్థానిక ఎన్నికల సమయంలో గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ సర్పంచ్ కల్పన రాజిరెడ్డి అభివృద్ధి దిశగా తొలి అడుగులు వేస్తున్నారు. గ్రామ మహిళల సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ… మహిళా సమాఖ్య భవనం నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కల్పన రాజిరెడ్డి మాట్లాడుతూ… గ్రామ అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ ప్రజలకు మంచినీటి ఉచిత సౌకర్యం కల్పించడం..ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. అలాగే గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, చెత్త సేకరణ కోసం ట్రాక్టర్‌ను సిద్ధం చేసి ప్రతి వీధిలో చెత్తను సేకరిస్తున్నామని తెలిపారు.
గ్రామంలో స్వచ్ఛతతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని, ప్రజల సహకారంతో లక్ష్మాపురాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పట్ మహేష్, నూకల రాజిరెడ్డి, నూకల బాల్రెడ్డి, పల్లపు రామకృష్ణ, ఇమ్మడి పుష్పల,శ్రీకాంత్, రాజు,ఇమ్మడి కవిత,నిర్మల, మహాలక్ష్మి, నవ్య తదితరులు పాల్గొన్నారు.

 

Author

admin

Follow Me
Other Articles
Previous

Sci-fi Television Star Summer Glau Added to Next Play Launch

Next

హలో మాదిగ – చలో కొలనుపాక

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

New Comments

    Copyright 2026 — Mana Praja Akshram. All rights reserved. Blogsy WordPress Theme